నోటితో విజయ్ దేవరకొండ బొమ్మ గీసిన దివ్యాంగురాలు..!

పట్టుదల, సంకల్పం ఉంటే వైకల్యం అడ్డురాదని నిరూపించింది ఓ దివ్యాంగురాలు. చేతులు లేకపోయినా నోటితో కుంచె, పెన్సిల్ పట్టుకుని చిత్రాలు గీయడంలో ఎంతో నైణ్యం సాధించింది. స్వప్నిక అనే దివ్యాంగురాలు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు పెద్ద ఫ్యాన్.

తాజాగా ఆమె విజయ్ దేవరకొండ చిత్రాన్ని నోటితో గీసింది. ఆమె బొమ్మ గీసిన వీడియోను ఆమె ట్విట్టర్ లో షేర్ చేసింది. ఆ వీడియోపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. నీకు అపారమైన ప్రేమను పంపుతున్నానని, నీ నుంచి స్ఫూర్తిని, శక్తిని పొందుతున్నానని విజయ్ ట్వీట్ చేశారు. ఆ వీడియోను తన ట్వీట్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది బాగా వైరల్ అవుతోంది.  

Leave a Comment