ఇలా జరిగితే.. భారత్ కు ఫైనల్ వెళ్లే ఛాన్స్?

ఆసియా కప్ 2022 సీజన్ లో టీమిండియా టైటిల్ ఫెవరెట్ గా అడుగుపెట్టింది. అనుకున్నట్లే లీగ్ మ్యాచుల్లో అదరగొట్టింది. అయితే అనూహ్యంగా సూపర్ 4 రౌండ్ లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. పాకిస్తాన్ పై ఓటమి చెందిన టీమిండియా.. శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్ లో ఓటమి పాలైంది. దీంతో   దాదాపు ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. అయితే సాంకేతికంగా చూస్తే ఆసియా కప్ 2022లో టీమిండియా ఫైనల్ కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. ఆఫ్గానిస్తాన్, శ్రీలంక జట్టులపై భారత్ భవిత్యం ఆధారపడింది. 

టీమిండియా ఫైనల్ కి చేరాలంటే..

  • బుధవారం పాకిస్తాన్ తో జరగనున్న మ్యాచ్ లో ఆఫ్ఘానిస్తాన్ విజయం సాధించాలి.
  • సెప్టెంబర్ 8న ఆఫ్ఘానిస్తాన్ తో జరగనున్న మ్యాచ్ లో టీమిండియా భారీ విజయం సాధించాలి.
  • సెప్టెంబర్ 9న పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించాలి.

అలా జరిగితే భారత్, పాకిస్తాన్ ఆఫ్ఘానిస్తాన్ జట్లు చెరో విజయంతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్ రేట్ ఆధారంగా ఒక టీమ్ ఫైనల్ కు చేరుకుంటుంది. సూపర్ 4లో వరుసగా రెండు విజయాలు సాధించిన శ్రీలంక దాదాపు ఫైనల్ కు చేరింది. ఇక రన్ రేట్ విషయానికి వస్తే.. టీమిండియా(-0.126), ఆఫ్ఘానిస్తాన్(0-.589) కంటే పాకిస్తాన్(+0.126) మెరుగ్గా ఉంది..      

 

Leave a Comment