వైరల్ వీడియో: బాలుడి టాలెంట్ ముందు వైకల్యం ఓడిపోయింది..!

సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయకమైన వీడియోలకు కొదవలేదు. ప్రజల వింత పరిస్థితులు, వారి జీవన విధానం వంటి అనేక వీడియోలను తరుచూ చూసి ఉంటారు. అలాంటి ఎమోషనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రెండు చేతులు లేని ఓ పిల్లాడు పెయింట్ వేస్తున్నాడు. ఐఏఎస్ అధికారి దీపాన్షు కబ్రా ఈ వీడియోను షేర్ చేశారు. బాలుడి స్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ వీడియోలో ఓ దివ్యాంగ బాలుడు పెయింటింగ్ వేస్తున్నాడు. ఇతర విద్యార్థులతో క్లాస్ రూంలో కూర్చున్న బాలుడు చెట్టుకు రంగులు అద్దుతుండటం ఈ వీడియో కనిపించింది. చేతులు లేకపోయినా ఈ కుర్రాడు చాలా అందమైన పెయింటింగ్ వేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన వైకల్యాన్ని అధిగమించి బాలుడు ప్రదర్శించిన నైపుణ్యం అద్భుతమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.    

Leave a Comment