సోనూసూద్ ఫౌండేషన్ కు 5 నెలల పింఛన్ ఇచ్చిన కంటి చూపు లేని మహిళ..!

కరోనా కష్టకాలంలో రియల్ హీరో సోనూసూద్ ఎందరికో అండగా నిలుస్తున్నాడు. కోవిడ్ కారణంగా బాధపడుతున్న వారికి అవసరమైన ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు, రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు తదితర వైద్య సదుపాయాలు అందించేందుకు తన వంతు సాయం అందిస్తున్నాడు. 

ఈక్రమంలో సోనూకు చేయూత ఇచ్చేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. తన తోటి నటీనటులతో పాటు దేశ నలుమూలల నుంచి అభిమానులు ముందుకు వస్తున్నారు. తాజాగా కంటి చూపులేని ఓ మహిళ పెద్ద మనసు చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని వరికుంటపాడుకు చెందిన బొడ్డు నాగలక్ష్మీ సోనూసూద్ ఫౌండేషన్ కు రూ.15 వేల విరాళం అందించింది. 

ఐదు నెలల పింఛన్ సొమ్మును జమ చేసుకని ఈ సాయం చేసింది. నాగలక్ష్మి యూట్యూబ్ లో వీడియోలు కూడా చేస్తుంటారు. నాగ లక్ష్మి మంచి మనుసుకు సోనూసూద్ ఫిదా అయ్యారు. ఇండియాలో అత్యంత ధనవంతురాలు నాగలక్ష్మి అని, ఇతరుల బాధను అర్థం చేసుకునేందుకు కంటి చూపు ఉండాల్సిన అవసరం లేదని కొనియాడారు..

Leave a Comment