వామ్మో నోట్లో అంత బంగారం ఎలా పట్టిందిరా బాబు..!

132
bangaram

మన దేశంలో బంగారం ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ ధరలు ఇండియాలో కంటే ఇతర దేశాల్లో తక్కువగా ఉంటాయి. వేరే దేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి కావాల్సి ఉంటుంది. దీంతో కొంత మంది స్మగ్లర్లు బంగారాన్ని ఒక దేశం నుంచి మరో దేశానికి తీసుకెళ్లేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. బంగారం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. అయినా స్మగ్లర్లు వెనకాడడం లేదు. ఏదో ఒకరకంగా బంగారాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికోసం వింతవింత దారులు వెతుకుతున్నారు. 

తాజాగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్లు చాలా తెలివిగా బంగారాన్ని నోట్లో దాచి పెట్టుకొని విమానాల్లో ప్రయాణించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ఉజ్జెకిస్తానీలను ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని డిల్లీ కస్టమ్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దాదాపు 951 గ్రాముల బంగారం పళ్లకు సెట్ రూపంలో బంగారపు చెయిన్ ను అమర్చుకుని వస్తున్న ఆ ఇద్దరిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. 

ఆగస్టు 28న రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ఉజ్జెకిస్తాన్ దేశస్తులను ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. పంటికి పెట్టుకునే సెట్ రూపంలో పూతపోసి 951 గ్రామాల బంగారాన్ని ఆ ఇద్దరు నోట్లో అమర్చుకుని వచ్చినట్లు ఢిల్లి కస్టమ్స్ ట్వీట్ లో వెల్లడించింది. ఆ బంగారం ఎక్కడిది.. దీని వెనుక స్మగ్లింగ్ ముఠా ఏమైనా ఉందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరో కేసులో ఓ భారతీయుడు 1801 గ్రాముల బంగారాన్ని బ్రౌన్ పేస్ట్ రూపంలో అతడి ప్యాంట్ జీన్స్ జేబులో పెట్టుకొని వస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.  

Previous articleఆడపిల్ల పుట్టిందని రూ.40 వేల పానీపూరీని ఉచితంగా అందించిన తండ్రి..!
Next articleట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్తున్న ప్రభాస్.. ఏమైందో తెలుసా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here