మధ్యప్రదేశ్ లో దారుణం.. 13 ఏళ్ల బాలికపై 9 మంది అత్యాచారం..!

13 ఏళ్ల బాలికను మూడు సార్లు కిడ్నాప్ చేసి.. 9 మంది వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉమారియా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు జనవరి 4న మార్కెట్ కు వెళ్లిన బాలికను స్థానికుడు ఒకడు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. 

అక్కడ మరో ఆరుగురితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైన చెబితే చంపేస్తానని బాలికలను బెదిరించారు. ఆ తర్వాత జనవరి 5న బాలికను విడిచిపెట్టారు. నిందితుల బెదిరింపులకు భయపడిన బాలిక ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. జనవరి 11న మరోసారి ఆమెను ఎత్తుకుపోయి, ఐదుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. 

వీరిలో ఇప్పటికే దారుణానికి పాల్పడిన ముగ్గురు ఉన్నారు. ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత బాలికను విదిలిపెట్టారు. దీంతో బాలిక ఇంటికి బయలుదేరింది. అయితే అదే సమయంలో బాలికను అపహరించిన ఇద్దరు ట్రక్ డ్రైవర్లు ఆమెను రేప్ చేశారు. అయితే వారి వద్ద నుంచి తప్పించుకున్న బాలిక చివరికి ఎలాగోలా ఇంటికి చేరుకుంది. 

అనంతరం జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు కాట్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 376, 366ఏతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసుకున్నారు. ఇద్దరు ట్రక్ డ్రైవర్లు సహా ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

 

You might also like
Leave A Reply

Your email address will not be published.