గొంతులో అన్నం మెతుకు ఇరుక్కుని 9 నెలల బాలుడు మృతి..!

కర్ణాటకలోని పావగడలో విషాదం చోటుచేసుకుంది. గొంతులో అన్నం మెతుకు ఇరుక్కుని 9 నెలల బాలుడు మరణించాడు. పావగడ తాలూకాలోని రాజవంతి గ్రామానికి చెందిన రాజప్ప, భారతి దంపతులకు సత్య అనే 9 నెలల బాలుడు ఉన్నాడు. ఆదివారం ఉదయం భారత వంట చేస్తోంది. ఆ సమయంలో కుమారుడు సత్య ఆడుకుంటున్నాడు. 

ఈక్రమంలో బాలుడు పక్కనే ఉన్న గిన్నెలోని అన్నం తినేందుకు ప్రయత్నించాడు. అన్నం మెతుకు గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరి ఆడక బాలుడు ఏడవడం ప్రారంభించాడు. దీన్ని గుర్తించిన భారతి బాలుడిని తీసుకుని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే ఆసమయంలో చిన్న పిల్లల వైద్యుడు అందబాటులో లేడు. వైద్యం అందించేందుక ఎవరూ ముందుకు రాకపోవడంతో బాలుడు మృతి చెందాడు..

Leave a Comment