ఏపీలో 87 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 87కి చేరాయి. మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 12 గంటల్లో మొత్తం 373 శాపిళ్లను పరీక్షించగా 43 పాజిటివ్‌గా, 330 నెగిటివ్‌గా వచ్చాయి. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 87 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో  ఇద్దరు కోలుకున్నారు.

అయితే కడప, ప్రకాశం జిల్లాల్లో 15 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అటు పశ్చిమ గోదావరి(13), విశాఖపట్నం(11), గుంటూరు(9), చిత్తూరు, తూర్పుగోదావరి, క్రిష్ణ జిల్లాల్లో ఆరు కేసులు చొప్పున నమోదు కాగా..నెల్లూరు(3), అనంతరపురంలో రెండు, కర్నూల్ జిల్లాలో ఒక్క కేసు నమోదైంది.

 

Leave a Comment