ఇండియాలో 82 శాతం మహిళలు.. భర్తతో శృంగారానికి నో అంటున్నారట..!

భార్యభర్తల బంధంలో శృంగారం కూడా ఒక భాగమే.. అన్యోన్యమైన జీవితానికి భార్యభర్తల బంధంలో శృంగారం ఒక ఔషధంగా పనిచేస్తుంది. పెళ్లయిన కొత్తలో సెక్స్ పై ఉండే ఆసక్తి.. రాను రాను తగ్గుతుందని చెబుతుంటారు. ముఖ్యంగా ఆడవారికి అంతగా ఉండదట.. తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 

భారతదేశంలో సుమారు 82 శాతం మంది మహిళలు తమ భర్తలతో శృంగారం చేయడానికి నిరాకరిస్తున్నారట.. ప్రతి ఐదు మంది మహిళల్లో నలుగురు(82శాతం) తమ భర్తతో శృంగారంలో పాల్గొనడం లేకపోతే నో చెప్పేస్తున్నారట.. లక్షద్వీప్ లో 94.2 శాతం, గోవాలో 82 శాతం, అరుణాచల్ ప్రదేశ్ లో 63 శాతం, జమ్మూకశ్మీర్ లో 65 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 79.3 శాతం, తెలంగాణలో 84.9 శాతం మంది తమ భర్తలతో శృంగారానికి నిరాకరిస్తున్నట్లు తేలింది. 

భర్తలు ఏమంటున్నారు?

ఈ సర్వలో భార్యలు సెక్స్ కి నిరాకరిస్తే.. భర్తలు ఏవిధంగా స్పందిస్తున్నారన్న దానిపై కొన్ని ప్రశ్నలు అడిగారు. మీ భార్యలు సెక్స్ కి నిరాకరిస్తే.. ఆర్థిక సాయం చేయడానికి నిరాకరిస్తారా? ఆమెతో బలవంతంగా సెక్స్ చేస్తారా? ఆమెను మందలిస్తారా? వేరే మహిళతో సెక్స్ లో పాల్గొంటారా? అని నాలుగు ప్రశ్నలు అడిగారు. 

ఈ నాలుగు ప్రశ్నలలో దేనితోనూ ఏకీభవించని పురుషులు 70 శాతం కంటే ఎక్కువ ఉన్నారు. 6 శాతం మాత్రమే పై నాలుగు విధాలుగా ప్రవర్తించే హక్కు తమకు ఉందని అంటున్నారు. 19 శాతం మంది పురుషులు తమ భార్యలు సెక్స్ కి నిరాకరిస్తే కోపగించుకుని, మందలించే హక్కు ఉందని సర్వేలో వెల్లడించారు. 

   

 

Leave a Comment