తలలో ఏకంగా 8 మేకులు.. జాగ్రత్తగా బయటకు తీసిన వైద్యులు..!

మామూలుగా తలకు ఏ చిన్న దెబ్బ తగిలినా వివిల్లాడిపోతాం.. అలాంటి ఓ యువకుడి తలలో ఏకంగా ఎనిమిది మేకులు దిగాయి. రాజస్తాన్ లో జోధ్ పూర్ ఎండీఎం ఆస్పత్రి వైద్యులు ఎంతో జాగ్రత్తగా శస్త్ర చికిత్స చేసి యువకుడి తల నుంచి మేకులు తీసి అతడి ప్రాణాలు కాపాడారు. 

వివరాల మేరకు ఓ 26 ఏళ్ల యువకుడు డ్రిల్ వర్క్ చేస్తుంటాడు. అతడు పనిచేస్తుండగా డ్రిల్ మిషన్ నుంచి వచ్చిన 8 మేకులు ఆ యువకుడి తలలో దిగాయి. దీంతో డిసెంబర్ 18న అతడిని రాజస్తాన్ లోని జోథ్ పూర్ ఎండీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ యువకుడిని పరీక్షించిన వైద్యులు ఎక్స్ రే, సిటీ స్కాన్ తీశారు. అతడి తలలో 8 మేకులు ఉన్నట్లు గుర్తించారు. 

ఓ మేకు అతడి మెదడులోకి లోతుగా దిగినట్లు గుర్తించి అత్యంత జాగ్రత్తగా రెండు రోజులు కష్టపడి ఆపరేషన్ చేసి మేకులను తొలగించారు. శస్త్రచికిత్స కొంచెం అటుఇటు అయినా యువకుడు మెమోరీ కోల్పోవడమో, పక్షవతానికి గురికావడమో లేక చనిపోవడమో జరిగేదని ఆస్పత్రిలోని న్యూరో సర్జరీ విభాగం బాధ్యుడు ఆచార్య డాక్టర్ శరద్ తన్వీ తెలిపారు. 

అతడిని పది రోజుల పరిశీలనలో ఉంచి.. పూర్తిగా కోలుకున్నాకా ఇంటికి పంపించారు. యువకుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నడని, ఎలాంటి సమస్య లేదని వైద్యులు స్పష్టం చేశారు. తొలి రోజు 7 మేకులను తల నుంచి బయటకు తీశామని, కుడివైపు మెదడు లోపలికి చొచ్చుకెళ్లిన మరో మేకును మరుసటి రోజు తీశామని వైద్యులు చెప్పారు.  

Leave a Comment