దేశంలో 75 జిల్లాలు లాక్ డౌన్…

దేశంలో కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న 75 జిల్లాలను మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారి చేసింది. ఈ నేపథ్యంలో 75 జిల్లాలలో అత్యవసర సేవలు మినహా మిగతా సర్వీసులు బంద్ కానున్నాయి.  

రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్ లు, కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కార్యదర్శి, ఇతర ముఖ్య అధికారులతో చర్చించిన అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసకుంది. మహమ్మారి కరోనాను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ తప్ప మరో ఆప్షన్ లేదని అధికారులందరూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రధాని జనతా కర్ఫ్యూకు ప్రజలు సహకరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ అవ్వనున్న జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ లోని క్రిష్ణా, తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలు, తెలంగాణ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి,మేడ్చల్, సంగారెడ్డి, భద్రాద్రి కరీంనగర్, ఖమ్మం జిల్లాలు ఉన్నట్లు సమచారం. 

 

Leave a Comment