‘సోనూసూద్ నే కొడతారా’.. అంటూ టీవీ పగలగొట్టిన బుడ్డోడు..!

కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. తన సేవా కార్యక్రమాలతో విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన అభిమానులు సోనూసూద్ ను విలన్ గా చూడటానికి ఇష్టపడటం లేదు. తాజాగా తన అభిమాన హీరో సోనూసూద్ ను సినిమాలో కొట్టడాన్ని జీర్ణించుకోలేని ఓ బుడ్డోడు టీవీని పగుల గొట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. 

న్యాల్ కల్ లోని ఎస్సీ కాలనీకి చెందిన ఏడేళ్ల బాలుడు విరాట్ సోమవారం రాత్రి టీవీలో దూకుడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఫైటింగ్ సీన్ లో హీరో మహేష్ విలన్ సోనూసూద్ ను కొడతాడు. ఈ ఫైట్ ఆ బాలుడికి కోపం తెప్పించింది. కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్ అంకుల్ ని కొడతావా అంటూ బయటకు వెళ్లి ఓ రాయిని తెచ్చి టీవీపై కోపంతో కొట్టాడు. దీంతో టీవీ పగిలిపోయింది. 

టీవీని ఎందుకు పగుల గొట్టావు అని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. అందరికీ సాయం చేస్తున్న సోనూసూద్ అంకుల్ ను వేరే వాళ్లు కొడుతుంటే కోపం వచ్చి రాయితో కొట్టాను అంటూ ఓ బుడ్డోడు సమాధానం చెప్పాడు. ఈ విషయం కాస్తా వైరల అయి సోనూసూద్ వరకు చేరింది. దీంతో స్పందించిన సోనూసూద్ ‘అరేయ్.. మీ టీవీ పగలగొట్టకు.. మళ్లీ మీ నాన్న నన్ను కొత్త టీవీ కొనాలని అడుగుతాడు’ అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. 

 

 

Leave a Comment