భారతదేశంలో అత్యంత ప్రమాదకర 7 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే..!

ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని చాలా మందికి ఓ కల.. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే చింత లేేకుండా ఉండవచ్చని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.. అయితే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒత్తిడితో పాటు రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ఉద్యోగాల్లో ఉన్న వారు అహర్నిశలు శ్రమిస్తూ ఉండాలి. నిత్యం ఒత్తిడితో మగ్గిపోవాల్సి ఉంటుంది.. మరీ ఆ ఉద్యోగాలేంటో ఇప్పుడు చూద్దాం.. 

1.రా ఏజెంట్:

సీక్రెట్ ఏజెంట్ లేదా అండర్ కవర్ పోలీస్ జీవితం అనేది రిస్క్ తో కూడుకున్న ఉద్యోగం. ఈ ఉద్యోగంలో ఎంత రిస్క్ ఉంటుందో మనం చాలా సినిమాల్లో చూసి ఉంటాం.. ఈ ఉద్యోగం చాలా కఠినమైంది. జాతీయ భద్రత పేరుతో మీ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది.. 

2.DRDO పరిశోధకులు:

DRDOలో ఉద్యోగం చాలా ప్రమాదంతో కూడుకున్న ఉద్యోగం. ఇందులో పనిచేసే ఉద్యోగస్తులు ఎంతో నిబద్ధతతో ఉండాల్సి ఉంటుంది. ఎక్కువ టైం పని చేయాల్సి ఉంటుంది. శారీరకంగా ఎలాంటి ప్రమాదం లేకపోయినా చాలా రిస్క్ తో పనిచేయాల్సి ఉంటుంది. 

3.ఇస్రో శాస్త్రవేత్తలు:

ఇస్రోలో ఉద్యోగం అనేది హై పొటెన్షియల్ మరియు రిస్క్ తో కూడుకున్నది. ఇక్కడ శాస్త్రవేత్తగా ఉండటం అంటే మీరు చాలా వాణిజ్య రహస్యాలను కలిగి ఉన్నారని అర్థం.. అది థ్రిల్లింగ్ గా ఉన్నప్పటికీ దేశం యొక్క ఉజ్వల భవిష్యత్తుకు సేవ చేసేలా ఈ ఉద్యోగం ఉంటుంది. 

4.సాయుధ దళాలు:

ఆర్మీ, నావికాదళం, వైమానిక దళం, కోస్ట్ గార్డు ఉద్యోగం అనేది ఎంతో సాహసోపేతమైన మరియు ప్రమాదకరమైన ఉద్యోగం. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుంది. ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండాలి. అలాగే కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. 

5.ఫారెస్ట్ రేంజర్:

ఈ ఉద్యోగం కూడా ఎంతో రిస్క్ తో కూడుకున్నది.. అడవులు, జంతువులు, వన్యప్రాణులు, గిరిజనులను రక్షించడానికి ఎంతో రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్డ్మ్ హంటర్స్ నుంచి కూడా సురక్షితంగా ఉండాలి. ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం.. 

6.ఇంటెలిజెన్స్ బ్యూరో:

ఇది జాతీయ భద్రతా రంగానికి సంబంధించిన మరో ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగం.. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి 24*7 అప్రమత్తంగా ఉండాలి. ఉగ్రవాద కార్యకలాపాలు మరియు బెదిరింపుల నుంచి దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి, భవిష్యత్ దాడులను అంచనా వేయడానికి ప్రణాళికలు రూపొందించాలి. ఈ ఉద్యోగం ఎంతో ప్రమాదంతో కూడుకున్న జాబ్.. 

7.పురావస్తు శాస్త్రవేత్త:

ఏఎస్ఐ ద్వారా రిక్రూట్ అవ్వడానికి, దేశంలో పురావస్తు శాస్త్రవేత్తగా పనిచేయడానికి యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. చారిత్రక ప్రదేశాలు, స్మారక కట్టడాలు వంటి వాటిని రక్షిస్తూ ఉండాలి. ఇది కూడా ఎంతో రిస్క్ తో కూడుకున్న ఉద్యోగం.    

 

  

Leave a Comment