వృద్ధురాలి సాహసం : 2200 కి.మీ. సైకిల్ తొక్కతూ వైష్ణోదేవి ఆలయానికి ప్రయాణం..

భక్తి మనల్ని ఎలాంటి సాహసమైన చేసేలా చేస్తుంది. ఈ 68 ఏళ్ల మహిళ చేస్తున్న ప్రయాణం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. 68 ఏళ్ల వృద్ధురాలు వైష్టోదేవి ఆలయానికి వెళ్లేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఒంటరిగా 2200 కిలోమీటర్లు సైకిల్ పై ఆలయానికి వెళ్లేందుకు ప్రయాణం సాగించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

మహారాష్ట్రలోని బుల్దనా జిల్లా ఖామ్ గావ్ కు చెందిన 68 ఏళ్ల వృద్ధురాలు రేఖ దేవ్బంకర్ వైష్టోదేవి ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. హిమాలయాల్లో కొలువై ఉన్న వైష్ణోదేవిని దర్శించుకునేందుకు సైకిల్ పై తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఒంటరిగా సైకిల్ నడపుకుంటూ 2200 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. 

జులై 24న ఇంటి నుంచి బయలుదేరిన ఆమె ప్రస్తుతం మధ్యప్రదేశ్ బోర్డర్ వరకు చేరుకుంది. రాత్రి అయితే స్థానికంగా ఉండే దేవాలయాలలో సేదతీరుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇలా ప్రతి రోజూ 40 నుంచి 50 కిలోమీటర్ల దాకా ప్రయాణం సాగిస్తోంది. సైకిల్ తొక్కతూ తన గమ్యాన్ని చేరుకోవడానికి ఉత్సాహంగా వెళ్తోంది. 

Leave a Comment