67th National Film Awards : సత్తా చాటిన మహేష్, నాని సినిమాలు..

67వ జాతీయ అవార్డుల ప్రకటన జరిగింది. ఈ అవార్డుల్లో తెలుగు చిత్రసీమకు సంబంధించి మొత్తం ఐదు అవార్డులు లభించాయి. మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాకు మూడు, నాని నటించిన జెర్సీ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా తెలుగు భాషలో మహర్షి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఉత్తమ నిర్మాణ సంస్థగా దిల్ రాజుకు చెందిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా రాజు సుందరంకు అవార్డులు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా నాని నటించిన జెర్సీ సినిమా ఎంపికైంది. దీంతోపాటు ఉత్తమ ఎడిటర్ గా నవీన్ నూలి జాతీయ అవార్డు దక్కించుకున్నారు. 

మరోవైపు అన్ని భాషల్లోని సినిమాలు కూడా అవార్డులు సొంతం చేసుకున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చిచోరే సినిమా జాతీయ అవార్డు దక్కించుకుంది. ఉత్తమ నటుడు కేటగిరీలో ధనుష్, మనోజ్ బాజ్ పెయీ ఇద్దరు ఉన్నారు. నటిగా కంగన రనౌత్ మరోసారి ఎంపికైంది. 

67th National Film Awards

ఉత్తమ నటుడు – ధనుష్(అసురన్), మనోజ్ బాజ్ పాయ్(భోంస్లే)

ఉత్తమ నటి – కంగనా రనౌత్(మణికర్ణిక)

ఉత్తమ సహాయ నటుడు – విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)

ఉత్తమ సహాయ నటి – పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్)

ఉత్తమ దర్శకుడు – బహత్తార్ హురైన్

ఉత్తమ తెలుగు చిత్రం – జెర్సీ

ఉత్తమ హిందీ చిత్రం – చిచోరే

ఉత్తమ తమిళ చిత్రం – అసురన్

ఉత్తమ కరియోగ్రాఫర్ – రాజు సుందరం(మహర్షి)

ఉత్తమ యాక్షన్ కొరియోగ్రపీ – అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – మరక్కర్(మలయాళం)

ఉత్తమ సంగీత దర్శకుడు(నేపథ్య) – జ్యేష్టపుత్రో

ఉత్తమ మేకప్ – హెలెన్

ఉత్తమ గాయకుడు – కేసరి(తేరి మిట్టీ)

ఉత్తమ గాయని – బర్దో(మరాఠీ)

తెలుగు సినిమాకు వచ్చినవి..

ఉత్తమ తెలుగు చిత్రం – జెర్సీ

ఉత్తమ వినోదాత్మక చిత్రం –  మహర్షి

ఉత్తమ ఎడిటర్ – నవీన్ నూలీ(జెర్సీ)

ఉత్తమ నిర్మాణ సంస్థ – (శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి) 

ఉత్తమ కొరియో గ్రాఫర్ – రాజు సుందరం(మహర్షి)

 

 

Leave a Comment