ఈ బామ్మ డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే.. 62 ఏళ్ల వయస్సులోనూ తగ్గని జోష్..!

ప్రస్తుతం సినిమా పాటలకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం చాలా కామన్ అయిపోయింది. సినిమా పాటలకు తమ స్టయిల్ లో డ్యాన్స్ చేస్తూ అలరిస్తుంటారు. అయితే అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడిలో హల్ చల్ చేస్తోంది. ఆ డ్యాన్స్ చేసింది 62 ఏళ్ల బామ్మ.. వయసు ఒక సంఖ్య మాత్రమే అనే దాన్ని ఈ బామ్మ నిజం చేసి చూపించింది. 

రవి బాల శర్మ అనే ఈ బామ్మను డాన్సింగ్ దాది అని పిలుస్తారు. ఈ బామ్మకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా తన కొడుకుతో కలిసి విజయ్ మాస్టర్ సినిమాలోని వాతి కమింగ్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇటీవల ఈ డాన్సింగ్ దాదీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే నటించిన బాజీరావ్ మస్తానీ సినిమాలోని మోహో రాంగ్ దోలా అనే పాటకు అమేజింగ్ డ్యాన్స్ చేసింది. దీపికాతో పోటీపడుతూ ఈ బామ్మ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ నిజంగా అద్భుతమనే చెప్పాలి. గ్రేస్ ఫుల్ స్టెప్స్ తో రవి బాల శర్మ చేసిన డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. 

ఈ బామ్మ డ్యాన్స్ వీడియోలు నెటిజన్లతో పాటు బాలీవుడ్ సెలబ్రెటీలను కూడా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకుంది. అంతే కాదు గాయకుడు దిల్జిత్ దోసంజ్, ప్రొడ్యూసర్ ఇంతియాజ్ అలి, కొరియోగ్రాఫర్ టెరెన్స్ లూయిస్ వంటి సెలబ్రెటీలు కూడా ఈ దాదీ డ్యాన్స్ కు ఫిదా అయిపోయారు.     

Leave a Comment