24 ఏళ్ల యువకుడితో 61 ఏళ్ల బామ్మ పెళ్లి..!

149
Marriage

ప్రేమ ఒక అందమైన భావన. అది ఎప్పుడు ఎలా కలుగుతుందో ఎవరికీ తెలియదు. దాన్ని నిర్వహించాలన్నా కష్టమే.. ఎవరికీ అర్థం కాదు. ప్రేమకు వయస్సుతోనూ.. అందంతోనూ.. సంబంధం లేదు. అందుకే ప్రేమ గుడ్డిదని అంటారు.. అలాంటి ఘటనే ఇక్కడ జరిగింది. 61 ఏళ్లు ఉన్న వృద్ధురాలు, 24 ఏళ్లు ఉన్న యువకుడు ఒకరికొకరు ఇష్టపడ్డారు. పెళ్లి కూడా చేసుకున్నారు.. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా..  అవును ఇది నిజమే.. ఈ ఘటన అమెరికాలో జరిగింది.. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.. 

61 ఏళ్ల  వృద్ధ వనిత పేరు షెరిల్ మెగ్ గ్రెగోర్.. ఆ యువకుడి పేరు కొరాన్ మెక్ కెయిన్.. వీరిద్దరు అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో నివసిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం 2013లో వీరిద్దరికి తొలిసారిగా పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో కొరాన్ వయస్సు 16 సంవత్సరాలు. షెరిల్ కొడుకుకు సంబంధించిన షాపులో వీరు మొదటిసారిగా కలిశారు. అది వారిద్దరి స్నేహానికి దారి తీసింది. ఆ తర్వాత ఏడేళ్లకు 2020 నవంబర్ 4న రెండో సారి కలిశారు. అంతే ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. 

ఈక్రమంలో కొరాన్ ఈ ఏడాది ఏప్రిల్ లో షెరిల్ కు ప్రేమిస్తున్నట్లు చెప్పగా ఆమె అతడి ప్రేమను అంగీకరించింది. ఇంకేముంది ఎవరూ ఊహించని విధంగా సెప్టెంబర్ 3న వీళ్లిదరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లిని టిక్ టాక్ లో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇచ్చారు. షెరిల్ కు ఏడుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ముగ్గురు ఈ పెళ్లిని వ్యతిరేకించారు. అయితే తాను డబ్బు కోసమే షెరిల్ ను పెళ్లి చేసుకున్నట్లు కొందరు భావిస్తున్నారని, ఎవరెంత ద్వేషించినా తాము అందరిలాగే సాధారణ జీవితాన్నే గడుపుతామని కొరాన్ చెప్పుకొచ్చాడు.   

Previous articleఫుట్ బాల్ ఆడుతున్న ఎలుగుబంట్లు..!
Next articleసాయి తేజ్ ను కాపాడిన వ్యక్తికి రామ్ చరణ్ అద్దిరిపోయే గిఫ్ట్..నిజమేనా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here