హోమ్ వర్క్ చేయలేదని..చిన్నారిని కట్టేసి ఎండలో మిద్దెపై పడేశారు..!

హోమ్ వర్క్ చేయలేదని ఐదేళ్ల చిన్నారిని మండుటెండలో ఇంటి మిద్దేపై పడేశారు. ఈ హృదయ విదారక ఘటన దేశ రాజధాని ఢిల్లీలో  వెలుగుచూసింది.. కాళ్లు, చేతులు కట్టివేడయంతో ఎండలకు తాళలేక ఆ చిన్నారి తల్లడిల్లిపోయింది. 

ఢిల్లీలోని కాన్వాల్ నగర్ ప్రాంతంలో ఐదేళ్ల చిన్నారి ఒకటో తరగతి చదువుతోంది. జూన్ 2న ఆ చిన్నారి హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఆమె తల్లి కఠిన శిక్ష విధించింది. కూతురి కాళ్లు, చేతులు కట్టేసి.. ఎర్రటి ఎండలో ఇంటి మిద్దెపై పడేసింది.

ఇంటి మిద్దెపై చిన్నారి పడి ఉండటాన్ని పొరుగింటి వారు వీడియో తీసి వైరల్ చేశారు. జూన్ 2న మధ్యానం 2 గంటల సమయంలో మండుటెండలో ఈ ఉదంతం జరిగినట్లు అందులో వ్యాఖ్యానించారు. ఈ వీడియో పోలీసుల వరకు చేరడంతో.. వారు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. 

విచారణలో హోమ్ వర్క్ చేయనందుకే కూతురు కాళ్లు, చేతులు కట్టేసి ఇంటి మిద్దెపై పడేసినట్లు తల్లి అంగీకరించింది. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. చిన్నారిపై కర్కశంగా వ్యవహరించిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

 

 

Leave a Comment