పాడుపని చేసిన టీచర్ కు 49 ఏళ్ల జైలు శిక్ష..!

పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తన కోరిక తీర్చాలని విద్యార్థినులను వేధించాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. విద్యార్థినులను వేధించిన కేసులో ఓ ఉపాద్యాయుడికి 49 ఏళ్ల జైలు శిక్ష పడింది. అతడి నిర్వాకం తెలిసి కూడా పట్టించుకోని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కూడా ఏడాది జైలు శిక్ష పడింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

తమిళనాడులోని నరియన్ పుదుపట్టి ప్రాథమిక పాఠశాలలో అన్బరసన్ అనే 52 ఏళ్ల ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అన్భరసన్ 2018లో తన పాఠశాలలో చదువుతున్న ఆరుగురు విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో విద్యార్థినులు పాఠశాల హెడ్ మాస్టర్ జ్ఞానశేఖరన్ కు ఫిర్యాదు చేశారు. 

అయితే ఆ హెడ్ మాస్టర్ ఆ ఉపాధ్యాడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ విద్యార్థినులు పుదుక్కోటై మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో అన్బరసన్ మరియు హెడ్మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. రెండేళ్ల విచారణ తర్వాత ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు సోమవారం వెల్లడైంది. 

విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన అన్బరసన్ కు ఏకండా 49 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అతడి నిర్వాకం తెలిసి కూడా చర్యలు తీసుకోని హెడ్మాస్టర్ కు ఏడాది జైలు శిక్ష విధించింది. అంతే కాదు బాధితులైన ఆరుగురు విద్యార్థినులకు తలా లక్షన్నర రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.  

 

Leave a Comment