‘TikTok’ బ్యాన్ తో నష్టం ఎంతో తెలుసా?

భారత ప్రభుత్వం టిక్ టాక్ తో సహా 59 చైనీస్ యాప్లను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బ్యాన్ చేసిన యాప్లలో టిక్ టాక్ మాత్రమే చాలా ఫేమస్ యాప్. అందుకోసమే ఎక్కువ ఎఫెక్ట్ కూడా దానిమీదే పడింది. ఇండియాలో టిక్ టాక్ ప్రియులు మిలియన్లలో ఉన్నారు. 

అయితే ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ కావడం వల్ల చైనా సంస్థ బైట్ డ్యాన్స్ 6 బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రచురించింది. 6 బిలియన్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.45 వేల కోట్లు నష్టపోయినట్లు అన్న మాట. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో టిక్ టాక్ కు ఇండియాలోనే యూజర్లు ఎక్కువ. మొబైల్ యాప్ అనాలిసిప్ కంపెనీ సెన్సార్ టవర్ లెక్కల ప్రకారం భారత్ లో టిక్ టాక్ ను ఒక్క మే నెలలోనే 11.2 కోట్ల సార్లు డౌన్ చేసుకున్నారు.  

Leave a Comment