ఐఏఎస్ కావాల్సిన వారు.. చాయ్ వాలాలు అయ్యారు.. ఏడాదికి రూ.100 కోట్లు సంపాదిస్తున్నారు..!

సివిల్స్ లో ఉద్యోగం ఆ ముగ్గురు స్నేహితుల కల.. దాని కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ జాబ్ రాలేదు. ప్రయివేటు సెక్టార్ లో ఉద్యోగం చేయడం వారికి ఇష్టం లేదు. ఈక్రమంలో వారికి ఓ ఆలోచన వచ్చింది. ముగ్గురు స్నేహితులు కలిసి ఓ టీస్టాల్ ప్రారంభించారు. ఇప్పుడా టీస్టాల్ రూ.100 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో దుబాయ్, ఒమన్ లో ఫ్రాంచైజీలతో పాటు దేశవ్యాప్తంగా 165 ఓట్ లెట్ లు స్థాపించారు. 

మధ్యప్రదేశ్ కు చెందిన అనుభవ్ దూబే, ఆనంద్ నాయక్, మరో మిత్రుడితో కలిసి సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యారు. ఉద్యోగం రాలేదు. ప్రయివేట్ జాబ్ చేయడం వారికి ఇష్టం లేదు. దీంతో 2016లో అనుభవ్ దూబే తన స్నేహితులతో కలిసి ‘చాయ్ సుత్త బార్’ అనే టీస్టాల్ ప్రారంభించాడు. 

రూ.3 లక్షల పెట్టుబడితో వారు టీస్టాల్ ను ప్రారంభించారు. అనతి కాలంలోనే ‘చాయ్ సుత్త బార్’ బాగా ఫేమస్ అయింది. ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 165 ఔట్ లెట్స్ తో ఏడాదికి రూ.100 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. 

చాయ్ సుత్త బార్ లో రకరకాల ఫ్లేవర్లలో టీ లభిస్తుంది. ఒక్క టీ కేవలం 10 రూపాయలే.. ఇక్కడ చాయ్ మట్టి కప్పులో సర్వ్ చేస్తారు. చాయ్ సుత్త బార్ లో పొగ తాగడం నిషేధం.. ప్రతి రోజూ దాదాపు 3 లక్షల కప్పుల చాయ్ అమ్ముతామని చాయ్ సుత్త బార్ డైరెక్టర్ అనుభవ్ దూబే తెలిపారు. 

ప్రస్తుతం ఇండోర్ లో 13 ఔట్ లెట్ లు, దేశవ్యాప్తంగా 165 ఔట్ లెట్లు ఉన్నాయని దూబే పేర్కొన్నారు. ఇది కాకుండా దుబాయ్, ఒమన్ లలో కూడా ఫ్రాంచైజీలు ఉన్నాయన్నారు. త్వరలో కెనడా, లండన్ లో కూడా ఫ్రాంచైజీలు ప్రారంభించబోతున్నామని దూబే తెలిపారు. 

ఫ్రాంచైజీలు ఇవ్వడానికి ముందు ఔట్ లెట్ ఓపెన్ చేసే వారికి, వారి సిబ్బందికి 15 రోజుల శిక్షణ అందిస్తామన ఆయన తెలిపారు. శిక్షణ సమయంలో టీ తయారు చేసే విధానం, సెటప్ గురించి వివరిస్తామన్నారు. దాదాపు లక్ష నుంచి రూ.3 లక్షల పెట్టుబడితో ఫ్రాంచైజీ పొందవచ్చని, మొత్తం దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి మొత్తం రూ.12 నుంచి రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని ఆయన వెల్లడించారు. 

Leave a Comment