దేశంలో 29 శాతం ఆహార వస్తువులు నాసిరకమే..!

దేశంలో 29 శాతం ఆహార వస్తువులు నాసిరకంగా ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ(FSSAI)  గుర్తించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 1,06,459 ఆహార వస్తువుల నమూనాలను పరీక్షించింది. వాటిలో 30,415 ఆహార వస్తువులు నాసిరకంగా ఉన్నట్లు తేలింది. ఈ సంస్థ 2018-19కు సంబంధించి వార్షిక నివేదికను విడుదల చేసింది. 

నివేదిక ప్రకారం నాసిరకంగా ఉన్న వస్తువుల్లో 3,900 ప్రమాదకరంగాను, 16,870 నాణ్యతా లోపాలతో ఉన్నట్లు పేర్కొంది. మరో 9,645 నమూనాలు లేబిలింగ్, ఇతర లోపాలతో ఉన్నట్లు తేలింది. దీంతో 2,813 క్రిమినల్, 18,550 సివిల్ కేసులు నమోదు చేసింది. వారిలో 701 మందికి శిక్ష పడింది. మరో 12,734 మంది నుంచి జరిమానాల రూపంలో రూ.32.57 కోట్లు వసూలు చేసింది. 

ఇక దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 52 శాతం నమూనాలు నాసిరకంగా ఉన్నట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్ లో 14 శాతం, తెలంగాణలో 10 శాతం మేర నాసిరకం వస్తువులు ఉన్నట్లు గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ లో 4,715 నమూనాలను పరీక్షించింది. అందులో 692 వస్తువులు ప్రమాణాలకు అనుగుణంగా లేవు. వాటిలో 149 ప్రమాదకరంగా, 244 నాణ్యతా లోపంతో ఉన్నట్లు పేర్కొంది. 

Leave a Comment