హోటల్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ.. సూట్ ధరించి చాట్ బండి నడుపుతూ..!

ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం రాకపోతే.. ఎప్పుడు నిరుత్సాహపడకూడదు.. ఏ ప్రొఫెషన్ కి అయినా స్థాయి, అంతరాలు ఉండవు.. ఇష్టంతో పని చేయాలే కానీ.. ఏ ప్రొఫెషన్ లో అయినా విజయం సాధించగలరు. అదే చేశారు పంజాబ్ కి చెందిన అన్నదమ్ములు.. హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చేసి రోడ్డు పక్కన చాట్ అమ్ముతున్నారు.. అది కూడా బిజినెస్ సూట్లు ధరించి..

ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది.  పంజాబ్ లోని మొహాలీలో ఇద్దరు అన్నదమ్ములు సూట్-టై ధరించి పానీపూరీ, చాట్, దహీ భల్లా, భేల్ పూరి అమ్ముతున్నారు. ఇది చూసిన ఓ యూట్యూబర్ వారిని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాడు.. ఆ యూట్యూబర్ వారి బండి వద్దకు వెళ్లి సూట్ ఎందుకు ధరించారు అని అడిగాడు.. 

తాను హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేశాను. ఆ డ్రెస్ హోటల్ మేనేజ్మెంట్ కు సంకేతం అని ఆ అన్నదమ్ములు చెప్పారు. ఈ అన్నదమ్ములు డిఫరెంట్ స్టయిల్ లో చాట్ బండి నడుపుతున్న తీరు చూస్తుంటే.. ఏ వ్యాపారమూ చిన్నది కాదని ఓ సినిమా డైలాగ్ గుర్తొస్తోంది.. సూట్ ధరించి చాట్ అమ్ముతున్న వీరి వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు వారిని ప్రశంసిస్తున్నారు. మీరు తప్పకుండా యువకులకు స్ఫూర్తిగా నిలుస్తారు, వీరి దుస్తుల కోడ్ వారిని మరింత ప్రొఫెషనల్ గా చేస్తుంది.. మరి కొంతమంది యువకులు వీరి నుంచి నేర్చుకుంటారు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

 

Leave a Comment