గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్క పెట్టే.. చూస్తే షాక్.. పెట్టేలో పాప..!

ఓ పసిపాను చెక్క పెట్టే కొట్టుకొచ్చింది. ఆ పెట్టెలో పసిపాపతో పాటు అమ్మవారి ఫొటో ఉంది.  ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.  ఘాజీపూర్ సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద స్థానికంగా పడవ నడిపే వ్యక్తి చంటిబిడ్డ ఏడుపులను గమనించాడు. దీంతో ఆశ్చర్యపోయిన అతడు పెట్టె తెరిచి చూడగా షాక్ అయ్యాడు. ఎవరో బిడ్డను దుప్పట్లో చుట్టి చెక్క పెట్టేలో పెట్టి భద్రంగా గంగా నదిలో విడిచిపెట్టారు. 

అంతే కాదు బిడ్డతో పాటు కనకదుర్గమ్మ అమ్మవారి ఫొటో కూడా చేర్చారు. అలాగే బిడ్డ పుట్టిన జాతకం ప్రకారం.. ఆ బిడ్డకు ‘ గంగ’ అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది. బిడ్డ వయసు 21 రోజులు ఉంటుంది. ఆ బిడ్డను తాను పెంచుకుంటానని, ఇది గంగమ్మ తనకు ఇచ్చిన వరమని నావికుడు మురిసిపోయాడు. 

కానీ పోలీసులు దీన్ని నిరాకరించారు. బిడ్డను పెంచుకోవడం కుదరదని చెప్పారు. ఈ ఘటన పూర్వాపరాలపై ఆరా తీసుకున్నారు. 22 రోజుల పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నదిలో బిడ్డ కొట్టుకొచ్చిన వార్త సంచలనంగా మారింది. దీనిపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా స్పందించినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది. ఆ బిడ్డ బాధ్యతను పూర్తిగా తీసుకుంటామని ప్రకటించినట్లు తెలిపింది. 

Leave a Comment