కారు రివర్స్ తీస్తుండగా.. తండ్రి కారు కింద పడి చిన్నారి మృతి..!

హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం చోటుచేసుకుంది. తండ్రి కారు కింద పడి కొడుకు మృతిచెందాడు.. కారును రివర్స్ తీస్తుండగా చక్రాల కింద పడి కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల మేరకే జహీరాబాద్ కు చెందిన అంగిర్ల లక్ష్మణ్, రాణి దంపతులు.. వీరికి సాత్విక్(2) అనే బాలుడు ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం వీరు సిటీకి వచ్చి మన్సూరాబాద్ లోని కాస్మోపాలిటన్ కాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా చేరారు. లక్ష్మణ్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 

ఆదివారం అపార్ట్ మెంట్ దగ్గర లక్ష్మణ్ కారును క్లీన్ చేసి.. కారు రివర్స్ లో తీస్తుండగా వెనకాల సైడ్ నుంచి వచాడు. అది గమనించని లక్ష్మణ్ కారును అలాగే రివర్స్ తీశాడు. దీంతో అతడి కుమారుడు సాత్విక్ మీదుగా కారు వెళ్లింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సాత్విక్ ని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

Leave a Comment