13 ఏళ్ల వయసులో 17 కప్యూటర్ భాషలు.. బాలుడి రికార్డ్..!

నేర్చుకోవడానికి వయసుతో పనేంటి.. చేయాలన్న సంకల్పం ఉంటే చాలు.. ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల విద్యార్థి .. 13 ఏళ్ల వయస్సులోనే 17 కంప్యూటర్ భాషలను నేర్చుకున్నాడు.. ఫలితంగా పిన్న వయసులోనే ఈ ఫీట్ ను సాధించిన బాలుడిగా రికార్డులోకి ఎక్కాడు. 

కోయంబత్తురుకు చెందిన అర్నవ్ శివరామ్ కి 13 ఏళ్లు..  జావ, పైథాన్ వంటి కంప్యూటర్ లాంగ్వేజెస్ ను అలవోకగా నేర్చుకున్నాడు. శివరామ్ 4వ తరగతిలో ఉన్నప్పటి నుంచే కంప్యూటర్ భాషలను నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు ఏకంగా 17 కంప్యూటర్ భాషలను నేర్చుకున్నాడు. భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో ఆటో పైలట్ కోసం కృత్తిమ మేథస్సును తయారు చేస్తానని శివరామ్ చెబుతున్నాడు. 

 

 

Leave a Comment