ఉత్తరాఖండ్ లో ఆకస్మిక వరద.. 150 మంది గల్లంతు!

ఉత్తరాఖండలో దారుణం జరిగింది. రాష్ట్రంలోని ధౌలిగంగా నది ఆకస్మికంగా ఉప్పొంగింది. చమోలి జిల్లాలో నందాదేవి గ్లేసియర్ విరిగిపడటంతో ఆకస్మిక వరద పోటెత్తింది. చమోలీ జిల్లా రైనీ తపోవన్ వద్ద పవర్ ప్రాజెక్ట్ లోకి నీరు చేరింది. భారీ వరద ప్రవాహానికి ఆనకట్ట కొట్టుకుపోయింది. రుషిగంగా పవర్ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. 

దీంతో ప్రాజెక్టులో పనిచేస్తున్న 150 మంది కార్మికులు వరదల్లో గల్లంతయ్యారు. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ధౌలిగంగా నదీ తీరానికి వెళ్లవద్దని స్థానికులకు అధికారులు ఆదేశించారు. వరద పెరిగే అవకాశం ఉండటంతో ప్రమాదహెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తో ఘటన స్థలికి బయల్దేరారు. ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరాతీశారు.  

 

Leave a Comment