ఇల్లు రోడ్డుపై కదిలింది.. ఉన్న చోటు నుంచి మరో చోటుకు మార్చిన 139 నాటి ఇల్లు..

సాధారణంగా ఇల్లు కదలదు. మనుషులే ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారుతూ ఉంటారు. కానీ అమెరికాలో ఆ ఇల్లు కదిలింది. ఉన్న చోటు నుంచి మరో చోటుకు మారింది. ఇల్లు కదలడం ఏంటీ అనుకుంటున్నారా? అవును కింది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. 

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 139 ఏళ్ల నాటి ఈ ఇంటిని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించారు. 1880ల్లో నిర్మించిన ఈ ఇంటి పేరు ఇంగ్లాండర్. ఇందులో ఆరు బెడ్ రూమ్ లు, మూడు బాత్ రూమ్ లు ఉన్నాయి. తరతరాలుగా వస్తున్న ఇంటిని మారడం ఇష్టం లేని ఓ వ్యక్తి దాన్ని హైడ్రాలిక్ ట్రాలీపై ఉంచి రిమోట్ కంట్రోల్ సాయంతో మరో చోటుకు తరలించాడు. 

శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన టిమ్ బ్రౌన్ అనే వ్యక్తి ఓ అర కిలోమీటర్ దూరంలో ఉన్న వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలని అనుకున్నాడు. అయితే సమారు 139 ఏళ్ల చరిత్ర కలిగిన సొంతింటిని వదులుకోవడానికి ఇష్టపడని ఆ వ్యక్తి ఇల్లును భారీ ట్రాలీపై ఎక్కించి తీసుకెళ్లిపోయాడు. 

నిజానికి ఇంటిని తీసుకెళ్లే ప్రక్రియ 8 ఏళ్ల కిందటే ప్రారంభమైంది. దీనిని తరలించడం కోసం చెట్లను కట్ చేశారు. పార్కింగ్ మీటర్లను తొలగించారు. ఎలక్ట్రిక్ లైన్లను తీసేశారు. మొత్తానికి ఫిబ్రవరి 21న అంటే ఆదివారం ఈ ప్రక్రియను ముగించారు. ఇందు కోసం రూ.2.9 కోట్లు ఖర్చు చేశాడు. ప్రస్తుతం ఆ ఇంటిని తరలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment