ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో 13 కరోనా జైళ్లు..!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జైళ్లలో ఖైదీలు కరోనా బారినపతుండటంతో రాష్ట్రంలో 13 జిల్లాల్లో స్పెషల్ సబ్ జైళ్లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 13 స్పెషల్ జైళ్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నేరస్తులందరినీ కోర్టు ఆదేశాల అనంతరం ప్రత్యేక జైళ్లకు తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఈ ప్రత్యేక జైళ్లలో కరోనా టెస్టులు, ఇతర శానిటైజేషన్ ప్రొటోకాల్ ను పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. జైళ్లలో టెస్టులు చేసేందుకు ఒక వైద్యాధికారితో పాటు, పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించింది. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన ఖైదీలను వెంటనే కోవిడ్ ఆస్పత్రికి తరలించాలని, నెగిటెవ్ వచ్చిన ఖైదీలను మాత్రం సాధారణ జైలుకు తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అటు జైలు సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. స్పెషల్ జైళ్ల నుంచి ఖైదీలు పారిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. 

 

Leave a Comment