12 మంది చిన్నారులకు పోలియో చుక్కల బదులు శానిటైజర్ వేశారు..!

జనవరి 31న ఆదివారం పోలియో దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అయితే మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో దారుణం జరిగింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 12 మంది పిల్లలకు పోలియో చుక్కల బదులు హ్యాండ్ శానిటైజర్ వేశారు. 

ఈ విషయం వెంటనే తెలియడంతో పిల్లలందరినీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స తక్షణమే లభించడంతో వారికి ఏ అస్వస్థత లేదని, క్షేమంగా ఉన్నారని జిల్లా అధికారులు తెలిపారు. పిల్లలకు పోలియో చుక్కల బదులు శానిటైజర్ వేసిన ఓ డాక్టర్, ఓ హెల్త్ వర్కర్, ఆశా వర్కర్లను సస్పెండ్ చేస్తామని వారు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు.  

 

Leave a Comment