వామ్మో.. 112 పేజీల శుభలేఖ.. ఏమున్నాయంటే…!

వెడ్డింగ్ కార్డును తయారు చేయించడంతో ఎవరి అభిరుచులు వారివి. మామూలుగా వెడ్డంగ్ కార్డు రెండు నుంచి నాలుగు పేజీలు ఉంటుంది. కానీ కర్నాటకకు చెందిన రచయిత పంచాక్షరప్ప వేయించిన వెడ్డింగ్ కార్డు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ వెడ్డింగ్ పత్రికను 112 పేజీలతో తయారు చేయించారు. పంచాక్షరప్ప తన కూతురి పెళ్లి కోసం చేయించిన ఈ కార్డు అందరినీ ఆకట్టుకుంటుంది. 

ఆ కార్డులో తన పద్యాలు, కవితలు, వివాహ బంధాన్ని తెలిపే ప్రత్యేకతలను వివరించారు. వివాహాలపై మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచేందుకు వెడ్డింగ్ కార్డును అలా తయారు చేయించినట్లు పంచాక్షరప్ప తెలిపారు. పంచరంగి పేరుతో ముద్రించిన ఈ వెడ్డింగ్ కార్డు ప్రత్యేక రంగులతో కూడిన ఆర్ట్ పేపర్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 

You might also like
Leave A Reply

Your email address will not be published.