మహిళలకు సీఎం జగన్ వరాలు.. ఆ రోజు సెల్ ఫోన్ కొంటే 10 శాతం తగ్గింపు..!

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి సంబంధించిన సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళా దినోత్సవానికి ముందు రోజు అంటే ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.  మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 

ఇంకా ఏం నిర్ణయాలు తీసుకున్నారంటే..

  • నాన్ గెజిటెడ్ మహిళా ఉద్యోగుల సంఘాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం..
  • చేయూత కిరాణా దుకాణాల్లో అందుబాటులో శానిటరీ పాడ్స్.
  • దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ తో 2,000 స్టాండ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
  • దిశ యాప్ కోసం ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో ఈనెల 8న మొబైల్ ఫోన్లు కొనుగోలుపై మహిళలకు 10 శాతం రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
  • మహిళా భద్రత, సాధికారితపై షార్ట్ ఫిల్మ్ పోటీలు.
  • ప్రతి వింగ్ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం.
  • పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న మహిళలందరికీ ఆ రోజు స్పెషల్ డే ఆఫ్ ఇవ్వనున్నట్లు ప్రకటన.
  • ప్లస్-1, ప్లస్-2లో విద్యార్థినులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాని నిర్ణయం..

Leave a Comment