రేపటి నుంచి తిరుమలకు 50 ఆర్టీసీ బస్సులు..

జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. రేపటి నుంచి తిరుమలకు 50 బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. అయితే ఏఏ ప్రాంతాల నుంచి సర్వీసులు నడుపుతారో ఆర్టీసీ వివరాలు విడుదల చేయాల్సి ఉంది. 

కరోనా లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా జూన్ 8 నుంచి శ్రీవారి దర్శనాలకు భక్తులను అనుమతించాలని టీటీడీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ముందు జాగ్రత్తగా రేపటి నుంచి ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. టీటీడీ ఉద్యోగులతో పాటు తిరుపతిలో స్థానికులను ముందుగా ట్రయల్ రన్ పేరుతో దర్శనాలకు అనుమతిస్తారు. వీటిలో లోటుపాట్ల ఆధారంగా జూన్ 8 నుంచి దర్శనాలకు టీటీడీ సమగ్ర ప్రణాళిక విడుదల చేయనుంది. 

ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దర్శనానికి భక్తులకు బ్రేక్? 

కొండ దిగువున కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత పెరుగుతుండడంతో అమ్మవారి ఆలయానికి భక్తులను అనుమతించాలా లేదా అనే దానిపై దుర్గగుడి తర్జన బర్జనపడుతున్నారు. కంటైన్ మెంట్ జోన్, బఫర్ జోన్ కింద ఆలయం వస్తుందో తెలపాలని కలెక్టర్ ను దుర్గగుడి ఈవో సురేష్ బాబు కోరారు. కొండ వెనకాల విద్యాధరపురం, కుమ్మరిపాలెంసెంటర్,  భవానీపురం, కొండ‌దిగువున మల్లికార్జునపేట ఇతర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో దేవాదాయ శాఖ నుంచి ఇంకా అనుమతులు రాలేదు.  దేవాదాయ శాఖ నుంచి అనుమతుల కోసం వేచి చూస్తున్నారు.

Leave a Comment