నిధులు కేటాయించకపోవడానికి – వైసీపీ ప్రభుత్వమే కారణం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు నిధులు కేటాయించకపోవడనికి వైసీపీ ప్రభుత్వమే కారణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇలాంటి బడ్జెట్ రూపొందించిన ప్రధాని మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు జనసేన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చాలా బలమైన ఆర్థిక ప్రగతిని సాధించేదిగా బడ్జెట్ ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్ పై ఉన్నప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి గొప్ప ఆకాంక్షలతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పారు. ముఖ్యంగా రైతాంగానికి రూ.15 లక్షల కోట్ల రుణం కల్పించాలన్న ఆశయం, రూ.2.83 లక్షల కోట్ల నిధుల కేటాయింపు, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. మొత్తంగా బడ్జెట్ ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షిస్తున్న నవ భారతానికి బలమైన పునాదులు వేసేదిగా ఉందన్నారు. 

వైసీపీదే తప్పు…

రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాజధాని తరలింపు, రద్దులు, కూల్చివేతలు, ప్రతిపక్షాలను బూతులు తిట్టడంపై పెట్టిన శ్రద్ధ బడ్జెట్ పై పెట్టి ఉంటే రాష్ట్రానికి నిధులు వచ్చేేవన్నారు. ఇది పూర్తిగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు.

Leave a Comment