చంద్రబాబు స్వగ్రామంలో ఉద్రిక్తత

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇవాళ మధ్యాహ్నం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నారావారిపల్లె వద్ద వైకాపా సభ నిర్వహించాలని తలపెట్టింది. ఈ సభలో మంత్రులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకు వివరించాలని భావించారు. అయితే చంద్రబాబు స్వగ్రామంలో సభ ఏర్పాటు చేయడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా తెదేపా నేతలు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. వైకాపా సభ ఉండటంతో ఆందోళన విరమించాలని పోలీసులువిజ్ఞప్తిచేశారు. అయితే, గ్రామంలోకి పోలీసుల రాకతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఇది ప్రభుత్వ దాడిగా భావిస్తున్నాం: వర్ల

నారావారిపల్లెలో వైకాపా సభను ప్రభుత్వ దాడిగా భావిస్తున్నామని తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఈ ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. వైకాపా సభకు పోలీసులు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు.

Leave a Comment