కేంద్ర బడ్జెట్ 2020 – నిరాశపరిచిన బడ్జెట్

ఆర్థిక మంత్రి నిర్మల సీతరామన్  2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నరేంద్ర ;ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ప్రకటించలేదు. అయితే ఆదాయ పన్ను, డివిడెండ్ డిస్ట్రిబ్యుషన్ టాక్స్, ఇతర పన్నుల్లో మార్పులు చేసింది. 

బడ్జెట్ లో కీలక అంశాలు..

ధరలు పెరిగేవి…

. వైద్య పరికరాలపై 5 శాతం సెస్

. ఫర్నిచర్, చెప్పులు 

. ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు 

. ఆటో మొబైల్ విడి భాగాలకు పెరిగిన కస్టం సుంకం 

ధరలు తగ్గేవి..

. ఎలక్ట్రికల్ మొబైల్ ఫోన్ల విడి భాగాలకు తగ్గిన పన్ను 

. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్ కు పన్ను తగ్గింపు 

. ప్లాస్టిక్ ఆధారిత ముడిసరకు పై కస్టం పన్ను తగ్గింపు 

. టెక్స్ టైల్ సెక్టార్ పై ప్రస్తుతమున్న యాంటీ డంపింగ్ డ్యుటీ రద్దు 

పాన్ కార్డు, ఆధార్ కార్డు లేకుంటే

. పాన్ కార్డు, ఆధార్ కార్డు లేకుంటే లావాదేవీలపై పన్ను వడ్డన 

. పాన్, ఆధార్తో లావాదేవీలు జరిపితే  ఒక శాతం పన్ను

. పాన్, ఆధార్ లేకుండా లావాదేవీలు జరిపితే ఐదు శాతం పన్ను

నూతన వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు

. మధ్య, ఎగువ మధ్య తరగతిాకి ఊరటనిచ్చేలా చర్యలు

. ఆదాయపన్ను శ్లాబ్లు నాలుగు నుంచి ఏడుకు పెంపు

. 0 నుంచి రూ.2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు 

. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం పన్ను 

. రూ.5-7 లక్షల వారికి ఆదాయంపై పన్ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు 

. రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పన్ను 20 నుంచి 15 శాతానికి తగ్గింపు 

. రూ. 10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం పన్ను 

. రూ. 12.5 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం పన్ను

రూ.15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను 

కార్పొరేట్ ట్యాక్స్ 15 శాతం తగ్గింపు 

. కార్పొరేట్ పన్నుల తగ్గింపు విప్లవాత్మక నిర్ణయం.

. కొత్తగా అంతర్జాతీయ బులియన్ ఎక్సేఛేంజ్ ఏర్పాటు

. కార్పొరేట్ ట్యాక్స్ 15 శాతం తగ్గింపు 

. డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రద్దు

. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాల పునరుద్ధరణ గడువు 2021 వరకు పెంపు

. ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ల ప్రత్యేక చట్టం 

. మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలిక రుణాల మంజూరు

బ్యాంకుల్లో డిపాజిటర్ల సొమ్ము సేఫ్ 

. డిపాజిల్ భీమా పరిధి రూ.  లక్ష నుంచి 5 లక్షలకు పెంపు

.సహకార బ్యాంకుల పరిపుష్టి

. గిఫ్ట్ సిటీలో ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ ఛేంజ్ 

. షేర్ల అమ్మకం ద్వారా ఎల్ఐసీలో ప్రభుత్వ వాటా  పాక్షిక విక్రయం

. ఐడీబీఐ బ్యాంకులోని ప్రభుత్వ వాటా అమ్మకం 

. 2021లో జీడీపీ వృద్ధి రేటు పెరుగుతుందని ఆశాభావం

2022లో భారత్ లో జీ 20 సదస్సు

. 2022లో భారత్ లో జీ 20 సదస్సును రూ.100 కోట్లతో ఏర్పాటుకు సన్నాహకాలు

ఐదు చరిత్రాత్మక ప్రాంతాల అభివృద్ధి 

. రవాణ రంగ అభివృద్ధికి బడ్జెట్లో కొత్త వ్యూహాలు

. రాంచీలో ట్రైబల్ మ్యూజియం

. అహ్మదాబాద్లో మ్యారిటైమ్ మ్యూజియం

. పర్యాటక అభివృద్ధికి తేజస్ రైళ్లు

. రైల్వేలో మరింత ప్రైవేటీకరణ..పీపీపీ పద్ధతిలో 150 రైళ్లు

. వచ్చే నాలుగేళ్లలో 100 కొత్త ఎయిర్ పోర్టులు

. 2023 నాటికి ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే పూర్తి

. ముంబై-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు

. పెద్ద సంఖ్యలో తేజస్ తరహా, రైళ్లు, సెమీ హైస్పీడ్ రైళ్లు 

కరెంటు బిల్లుల స్థానంలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు

. చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్ పథకం

. త్వరలో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ

. ఇక నుంచి యంత్రాలతో సెప్టిక్ ట్యాంకుల క్లినిం్

. ప్రైవేటు రంగంలో డేటా సెంటర్ పార్క్ లు ఏర్పాటు

. కరెంటు బిల్లుల స్థానంలో త్వరలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు

వివాహ వయస్సు పెంపుపై  టాస్క్ ఫోర్స్

 . ఆడపిల్లల వివాహ వయస్సు పెంపు విషయంలో టాక్స్ ఫోర్స్ ఏర్పాటు

. 6 లక్షల మంది అంగన్ వాడీలకు సెల్ ఫోన్లు

. మహిళా సంక్షేమ పథకాలకు రూ.28,600 కోట్లు

. పౌష్టికాహార పథకానికి రూ.35.6 కోట్లు

. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థ

. 284 బిలియన్ డాలర్లకు చేరిన ఎఫ్ డీ ఐలు

. 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు

. నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ యూనివర్సిటీ ప్రారంభం

. ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్ కాలేజీ

కొత్తగా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్ మెంట్ సెల్..

. యువ పారిశ్రా మిక వేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం

. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్ మెంట్ సెల్ ఏర్పాటు

. గ్లోబలైజేషన్ కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్ధి

రంగాల వారీగా కేటాయింపులు..

  1. విద్యారంగానికి రూ.99.300 కోట్లు
  2. జల్ జీవన్ మిషన్ కు రూ.11,500 కోట్లు
  3. కొత్తగా ైదు స్మార్ట్ సిటీల అభివృద్ధి
  4. నేషనల్ టెక్నికల్ టెక్స్ టైల్ మిషన్ ఏర్పాటుకు రూ.1480 కోట్లు
  5. పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ.27,300 కోట్లు
  6. రవాణా మౌలిక సదుపాయాలకు రూ.1.7 లక్షల కోట్లు
  7. సీనియర్ సిటిజ్ల సంక్షేమానికి రూ.9500 కోట్లు
  8. టూరిజం ప్రోత్సాహానికి రూ.2500 కోట్లు
  9. సాంస్కృతిక శాఖకు రూ.3150 కోట్లు

వ్యవసాయ రంగానికి పెద్ద పీట

. రూ.15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు

. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ.2.83 లక్షల కోట్లు

. పంచాయతీరాజ్కు రూ.1.23 లక్షల కోట్లు

. ఆరోగ్య రంగానికి రూ.69,000 కోట్లు

. స్వచ్ఛ భారత్ మిషన్ కు రూ. 12.300 కోట్లు 

. పైప్ డ్ వాటర్ ప్రాజెక్టుకు రూ.3.6 లక్షల కోట్లు

. గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి

. ఆన్ లైన్లో ఆర్గానికి ఉత్పత్తులు

. 16 లక్షల మంది రైతులకు గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ 

ప్రాధాన్యతా అంశాలు..

తొలి ప్రాధాన్యం – వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి

ద్వితీయ ప్రాధాన్యం – ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు

మూడో ప్రాధాన్యం – విద్య, చిన్నారుల సంక్షేమం

. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు 

. 100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు

. 26 లక్షల మంది రైతులకు సోలార్ పంపు సెట్లు.

Leave a Comment