ఆందోళన చెందొద్దు

దరఖాస్త చేసుకున్న ఐదు రోజుల్లో పింఛన్ మంజూరు

సీఎం జగన్

అమరావతి : గ్రామ సచివాలయాల్లో వైఎస్సార్ పింఛన్ కానుకకు అర్హులైన వారి పేర్లు ప్రదర్శించామని, ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే ఆందోళన చెందాల్సిన పని లేదని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వారు సచివాలయాల వద్ద దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజుల్లో అధికారులు పరిశీలించి వెంటనే మంజూరు చేస్తారని చెప్పారు. ఎలాంటి సమస్య ఉన్న గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పింఛన్లు గడప వద్దకే చేర్చాలన్న తన సంకల్పం సాకారమైందన్నారు. అవినీతి, వివక్ష లేకుండా 54.6 లక్షల మందికి ఇంటి వద్దే పింఛన్ ఇస్తున్నారన్నారు. కొత్తగా 6.11 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. పింఛన్ ను రూ.1000 నుంచి రూ.2,250కి పెంచామని తెలిపారు. 

76 % పింఛన్ల పంపిణీ…

రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 76.59 శాతం మందికి పింఛన్ల పంపిణీ జరిగింది. 54.68 లక్షల మందికి గానూ 41.87 లక్షల మందికి పంపిణీ చేశారు. అత్యధికంగా కడప జిల్లాలో 31.05 లక్షల మందికి 26.74 లక్షల  మందికి పింఛన్ల పంపిణీ జరిగింది. తరువాతి స్థానాల్లో శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. చివరి వరుసలో విశాఖపట్నం నిలిచింది.

Leave a Comment