అదరగొట్టిన SBI

క్యూ౩ ఆర్థిక ఫలితాలు వెల్లడి 

పెరిగిన నికర లాభం 

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా దుమ్మురేపింది. అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను బ్యాంకు తాజాగా విడుదల చేసింది. బ్యాంకు నికర లాభం 41శతం వృద్ధితో 6,797 కోట్ల  రూపాయల లాభాన్ని ప్రకటించింది. ఈ స్థాయి లో నికర లాభం పెరగడం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి. మొండి బకాయిల వసూళ్లతో కేటాయింపులు తగ్గడంతో లాభం ఈ స్థాయిలో పెరిగింది. 

మొత్తం ఆదాయం రూ.84,390 కోట్ల నుంచి పెరిగి రూ. 95,384 కోట్లకు చేరింది. 2018 డిసెంబరు 31 నాటికి ఎన్ పీ ఏల నిష్పత్తి 8.71 శాతంగా ఉండగా..ఇప్పుడు 6.94 శాతని తగ్గింది. నికర వడ్డీ ఆదాయం రూ.22,691 కోట్ల నుంచి 22.42 శతం పెరిగింది. అది ఇప్పుడు 27,779 కోట్లకు చేరింది. ఎస్సార్ స్టీల్ నుంచి రూ . 11,000 కోట్లు వసూలు కావడంతో ఇందుకు దోహదం చేసింది. 

స్టాండ్ లోన్ ప్రాతిపదికన అక్టోబర్ – డిసెంబర్లో sbi లాభం రూ.5,58౩.౩6 కోట్లుగా నమోదయింది. ఇది sbi చరిత్రలో రికార్డు లాభం. 2018-19లో వచ్చిన రూ.3,958.81 కోట్ల తో పోలిస్తే లాభం 41 శతం పెరగడం గమనార్హం. ఆదాయం కూడా రూ.70,311 కోట్ల నుంచి రూ.76,797 కోట్లకు చేరింది. మొండి బకాయిలకు కేటాయింపులు కూడా రూ.81,193.06 కోట్లకు తగ్గించుకుంది.

Leave a Comment