వీడియో వైరల్ : బామ్మా..నీకు సెల్యూట్..!

కొంత మంది ఒల్లు అలవకుండా జీవితం గడవాలి అనుకుంటారు. కానీ మరికొంత మంది పస్తులున్నా అత్మాభిమానాన్ని వదులుకోకుండా బతుకుతారు. అలాంటివాళ్లు చాలా అరుదుగా ఉంటారు. పూణేకు చెందిన శాంతాబాయి పవార్ కూడా ఈ కోవకే చెందుతారు. 80 ఏళ్ల వయసులోనూ శక్తి కూడదీసుకుని తనకు వచ్చిన విద్యను ప్రదర్శిస్తూ పొట్టపోసుకుంటోంది. రోడ్ల మీద కర్రతో విన్యాసాలు చేస్తూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటుంది. ఈ బామ్మకు సంబంధించిన వీడియోను బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బామ్మకు సెల్యూట్ చేస్తున్నారు. ఈ బామ్మకు సంబంధించిన వివరాలు అడుగుతున్నారు.  

Leave a Comment