ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో జనసేనాని..!

ఢిల్లీ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీతో ఏపీలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీల ఉమ్మడి ప్రయోజనాల కోసం పని చేస్తామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. ఇక, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అక్కడ ఇతర రాష్ట్రాల ప్రజల ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తెలుగు వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఆ నియోజకవర్గాల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారానికి పవన్ ను దించాలని కమలనాధులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జనసేన అధినేతతో చర్చలు మొదలయ్యాయి. వచ్చే వారంలో పవన్ ఢిల్లీలో బీజేపీ అభ్యర్ధులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ రోజు అధికారికంగా దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. అయితే, పవన్ సమర్ధతకు ఇప్పుడు ఇది మరింత ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. పవన్ ఏ మేర ప్రభావం చూపించగలుగుతారనేది ఆసక్తి కరంగా కనిపిస్తోంది.

Leave a Comment