డాక్టర్స్ కాబోయి యాక్టర్స్ అయిన టాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే..!

కొంత మందికి డాక్టర్ కావాలని కోరిక ఉంటే.. మరికొందరికి యాక్టర్ కావాలని కోరిక ఉంటుంది.. అయితే డాక్టర్ అయ్యి కూడా యాక్టర్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. డాక్టర్ వృత్తిని వదిలి చాలా మంది టాలీవుడ్ లో పెద్ద నటులుగా మారారు. ఇందులో కొంత మంది ఇప్పటికీ డాక్టర్లుగా చూస్తూనే యాక్టింగ్ కూడా చేస్తున్నారు. టాలీవుడ్ లో డాక్టర్ వృత్తిని వదిలి యాక్టర్ గా మారిన వారు ఎవరో ఓ సారి చూద్దాం.. 

  

అల్లు రామలింగయ్య :

అల్లు రామలింగయ్యకు ఆయుర్వేద వైద్యంలో మంచి పట్టు ఉంది. ఆయన ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఈ వృత్తిని కొనసాగించారు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు.

రాజశేఖర్ :

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తెలుగు వెలిగిన రాజశేఖర్, గతంలో ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టారు. హీరో రాజశేఖర్ కూడా చాలా పెద్ద డాక్టర్. రాజశేఖర్ హస్తవాసి మంచిదని ఒకానొక సందర్భంలో సునీల్ చెప్పుకొచ్చారు. ఓవైపు నటన కొనసాగిస్తూనే డాక్టర్ వృత్తి చేసుకుంటూ వచ్చారు. 

సాయి పల్లవి :

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఇండస్ట్రీలో లేడీ పవన్ కళ్యాణ్ గా గుర్తింపు పొందిన ఈమె, తన పాత్రల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఈ అమ్మడు కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసి, సినిమాల్లో చేస్తోంది.

భరత్ రెడ్డి:

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న భరత్ రెడ్డి కూడా డాక్టర్ అని చాలా మందికి తెలియదు. యాక్టింగ్ పై ఉన్న ఇష్టంతో ఆయన డాక్టర్ వృత్తి చేస్తూ యాక్టర్ గా పలు సినిమాల్లో నటిస్తున్నారు.

భద్రం:

మహానుభావుడు, ప్రతి రోజు పండగే, భలే భలే మగాడివోయ్ సినిమాల్లో మంచి కమెడియన్ గా నటించిన భద్రం కూడా డాక్టరే.

ప్రభాకర్ రెడ్డి :

ఒకప్పుడు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ రెడ్డి మెడిసిన్ కంప్లీట్ చేశాడు. తర్వాత నటనపై మోజుతో ఇండస్ట్రీలోకి వచ్చాడు.

నివేద థామస్ :

ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న నివేద థామస్, డాక్టర్ కోర్సు పూర్తి చేసింది. నటనతో పాటుగా మరో పక్క ప్రాక్టీస్ కూడా చేస్తోంది.

ప్రణీత :

హీరోయిన్ ప్రణీత తల్లిదండ్రులు డాక్టర్స్ కావడంతో ఆమె కూడా అదే వైపు మళ్లింది. ప్రస్తుతం డాక్టర్ ప్రాక్టీస్ వదిలిపెట్టి సినిమాలు చేస్తోంది. 

అజ్మల్ అమీర్ :

రంగం అనే మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన అమీర్, రచ్చ,అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాల్లో నటించారు. ఈయన కూడా మెడిసిన్ పూర్తి చేశారు.

రూప కొడువాయుర్ :

వెంకటేశ్ మహా డైరెక్షన్ లో సత్యదేవ్ హీరోగా చేసిన సినిమాలో నటించింది రూపా. ఈమె కూడా మెడిసిన్ పూర్తిచేసింది.

నటాషా దోషి :

బాలకృష్ణ హీరోగా నటించిన ‘జై సింహా’ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది నటాషా దోషి. ఆమె హీరోయిన్ కాకముందు ఓ డాక్టర్. ప్రస్తుతం ఇతర భాషల్లో సినిమాలు చేస్తోంది. 

Leave a Comment