అర్ధరాత్రి ఎపి ప్రభుత్వం సంచలన నిర్ణయం

అమరావతి : ఎపి ప్రభుత్వం అర్ధరాత్రి  సంచలన నిర్ణయం తీసుకుంది. పాలన వికేంద్రికరణను అధికారికంగా ప్రారంభించింది. పాక్షిక న్యాయ విభాగం అయిన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీ చైర్మన్ సభ్యుల కార్యాలయాలను కర్నూల్ కు తరలించినట్లు ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ విభాగాలు అన్నీ వెలగపూడి సచివాలయంలో ఉండగా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఇవన్ని కర్నూల్ కు తరలించినట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది. ఈ విభాగాలు అన్నింటికీ అవసరమయిన బిల్డింగ్ లను ఏర్పాటు చేయాలనీ ఆర్ అండ్ బీ మరియు కర్నూల్ కలెక్టరేట్కు ఎపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హై కోర్టు అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తరలించవద్దని గతంలో న్యాయ స్థానం హెచ్చరించింది. కానీ పరిపాలన సౌలభ్యం కోసం అంటూ ప్రభుత్వం ఈ నిర్ణయం తెసుకుంది. న్యాయ, న్యాయ సంబంధిత కార్యాలయాలు కర్నూల్ లో పెడతామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Comment